రష్యన్ మహిళను నిలువునా ముంచేసిన భారతీయ భర్త..పెండ్లి తర్వాత రెండు సార్లు మోసం చేసిన భర్త 

రష్యన్ మహిళను నిలువునా ముంచేసిన భారతీయ భర్త..పెండ్లి తర్వాత రెండు సార్లు మోసం చేసిన భర్త 
  • పీహెచ్‌‌డీ చేయడానికి వచ్చి ఇండియన్‌‌తో ప్రేమలో పడ్డ ఓల్గా
  • రష్యా వెళ్లకుండా వేధింపులు

న్యూఢిల్లీ: రష్యన్ మహిళను భారతీయ భర్త నిలువునా ముంచేశాడు. ప్రేమ, పెండ్లి పేరుతో నమ్మకద్రోహం చేశాడు. అతడు చేసిన మోసాన్ని భరించలేక స్వదేశానికి వెళ్లిపోదామని ఆమె నిర్ణయించుకుంది. అయితే, భర్త పెట్టిన తప్పుడు మిస్సింగ్ కేసు వల్ల అధికారులు ఆమెను విమానం ఎక్కనివ్వలేదు. రష్యాకు చెందిన ఓల్గా 2015లో పీహెచ్‌‌డీ కోసం జవహర్‌‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌‌యూ)లో చేరింది.

అంతకు ముందే 2014లోనే పరిచయమైన భారతీయ యువకుడితో ప్రేమలో పడింది. 2019లో అతడిని పెండ్లి చేసుకుంది. సంసారం సాఫీగా సాగిపోతున్న సమయంలో 2023 నవంబర్‌‌లో కష్టాలు మొదలయ్యాయి. ఆమె స్పౌజ్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే  ఇంటర్వ్యూకు వెళ్లకుండా మాయమయ్యాడు. దీంతో పోలీసులకు ఆమె మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఆమె భర్త మాత్రం వారణాసిలో సాధువు వేషంలో తిరగడం ఓ వీడియోలో గమనించింది.

ఓల్గా దీని గురించి అడిగితే క్షమాపణలు కోరాడు. క్షమించి రెండోసారి చాన్స్ ఇస్తే, హిమాచల్ ప్రదేశ్‌‌లో ఆమె సంపాదనపై బతుకుతూనే, మరో మహిళతో సహజీవనం చేశాడు. ఈ ద్రోహాలను భరించలేక ఓల్గా రష్యాకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకోగా తప్పుడు మిస్సింగ్ కేసు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నాడు.  ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేక, వీసా గడువు ముగిసి, అటు రష్యా వెళ్లలేక.. ఇటు ఇండియాలో ఉండలేక ఆమె చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది.